అమరావతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సన్నాహాలు

1269చూసినవారు
అమరావతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
అమరావతిలో 27 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్, 7 దీవుల అభివృద్ధికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మాస్టర్ ప్లాన్, డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ నియామక బిడ్లు జులై 3న ముగియనున్నాయి. 2028 కృష్ణా పుష్కరాల నాటికి ఉద్దండరాయునిపాలెంలో 3 కిలోమీటర్ల పైలట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 1 కిలోమీటర్ మేర మెరీనాను ఏర్పాటు చేస్తారు. పర్యాటక, పర్యావరణ అనుకూల విధానాలతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు.

సంబంధిత పోస్ట్