నున్న పోలీసులు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మనోహర్, షేక్ షబ్బీర్లు రేషన్ కార్డు లబ్ధిదారుల నుంచి కిలోకు రూ. 15 చొప్పున పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బియ్యం రవాణా కోసం లారీని అద్దెకు తీసుకుని సుమారు 520 బస్తాల బియ్యాన్ని తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు.