రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) 2029 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా అ వతరిస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలోగురువారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పాలకుల పనితీరు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోందని, కక్షపూరిత రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటు దిశగా ఆర్‌పీసీ కార్యాచరణ ప్రారంభించిందని, పేదరికం లేని సంపన్న రాష్ట్ర నిర్మాణం తమ లక్ష్యమని పేర్కొన్నారు.