రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహనే లక్ష్యం: షరీనా బేగం

0చూసినవారు
రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహనే లక్ష్యం: షరీనా బేగం
ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా 15 నుంచి 18 ఏళ్ల వయసు గల స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం "ట్రాఫిక్ సమ్మర్ క్యాంప్-2026"ను నిర్వహిస్తున్నట్లు డిసిపి షరీనా బేగం తెలిపారు. ఈ క్యాంప్ జూన్ 8, 9, 10 తేదీలలో బందర్ రోడ్లోని వ్యాస్ బిల్డింగ్ 3వ అంతస్తులో జరుగుతుంది. దీని ద్వారా యువతలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్