విజయవాడలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా (ఏఎస్ఐ) ఉద్యోగోన్నతులు కల్పించారు. సీపీ రాజశేఖర్ బాబు ఈ పదోన్నతులు కల్పించి, వారిని బదిలీ చేశారు. ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన ఏలేశ్వరం మెహర్ బాబు, ఉమామహేశ్వరరావు, మురళీకృష్ణ శుక్రవారం సీపీ రాజశేఖర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా సీపీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.