విజయవాడలోని దుర్గాకళామందిర్‌లో ఎన్టీ రామారావుకు ఎంతో సెంటిమెంట్ ఉన్న ఒక గది ఉంది. 1934లో ఆయన ఇక్కడే నాటకాలు వేసేవారు, ఆయన నటించిన 175 సినిమాలు ఇక్కడే ప్రదర్శితమయ్యాయి. ఈ గది కలిసిరావడంతో, ఎన్టీఆర్ విజయవాడ వచ్చినప్పుడు లేదా షూటింగ్ జరిగినప్పుడు హోటళ్లలో కాకుండా ఇదే గదిలో ఉండేవారు. టీడీపీ కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచే నడిచేవి. ఆయన ఉదయం ఇక్కడే వ్యాయామం చేసి, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ, సాంబార్ తెప్పించుకునేవారు.