స్థానిక కొత్తపేటలోని సాయిబాబా ప్రశాంత నిలయంలో శ్రీ ఈశ్వర పుత్ర భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గురుస్వామి కామరాజ్, హరీష్ కుమార్ ఆచారి, నిర్వాహకులు భోగవల్లి పృథ్వి సాయి కుమార్ పూజలు నిర్వహించగా, భక్తులు అయ్యప్ప నామస్మరణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అష్టోత్తర పూజలు చేసి, తీర్థప్రసాదాలతో పాటు మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేశారు.