విజయవాడ: బస్సులో సీటు కోసం రచ్చ.. కండక్టర్పై వ్యక్తి చిందులు

4చూసినవారు
విజయవాడలో ఆర్టీసీ బస్సులో సీటు దొరకలేదని ఒక వ్యక్తి కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. చిల్లకల్లు వంతెన వద్ద బస్సు ఎక్కిన మహిళకు సీటు లేకపోవడంతో ఆమె కండక్టర్‌ను ప్రశ్నించింది. దీనికి మద్దతుగా ఆ వ్యక్తి కండక్టర్‌ను దుర్భాషలాడుతూ రెచ్చిపోయాడు. ఈ గొడవతో ప్రయాణికులు కాసేపు ఇబ్బంది పడ్డారు. తోటి ప్రయాణికులు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్