విజయవాడ గొల్లపూడి- చినకాకాని (17.88 కి.మీ) బైపాస్ పనులు ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తవుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేవలం 4 కి.మీ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రూ. 1,194 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ 6 వరుసల రహదారి అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.