విజయవాడ: ముఖ్యమంత్రివా?.. కీలుబొమ్మవా..?: షర్మిల

1చూసినవారు
విజయవాడ: ముఖ్యమంత్రివా?.. కీలుబొమ్మవా..?: షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై 'X' వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. MGNREGAపై కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు మౌనంగా ఉండటం దారుణమని, బీజేపీ నల్ల చట్టాలకు చప్పట్లు కొట్టడం సిగ్గుచేటని ఆమె ఆరోపించారు. కొత్త చట్టాలతో పనికి పాతరేస్తుంటే అడ్డుకొనే బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ, చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక మోడీ చేతిలో తోలుబొమ్మవా అని షర్మిల ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :