విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, విజయవాడలో కాలుష్యాన్ని తగ్గించి, ఆంధ్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు నగరపాలక సంస్థ ఉచితంగా పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేస్తోందని తెలిపారు. నగరంలోని మూడు నియోజకవర్గాల ప్రజలకు నేటి నుండి ఈ మొక్కలను అందిస్తామని, ఆసక్తిగల ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని ఆయన కోరారు.