మాచవరం సీఐ వెంకటరమణ ఈట్ స్ట్రీట్లోని ఫుడ్ స్టాల్ యజమానులకు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో, రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు, ట్రాఫిక్ ఇబ్బందులు నివారించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు వ్యాపారస్తులందరూ సహకరించాలని ఎస్ఐ శంకర్రావు కోరారు.