విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా స్క్రూ బ్రిడ్జి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారి కొండలరావు తెలిపారు. పకీరుగూడెం, ప్రగతినగర్, చంద్రమౌళిపురం, టిక్కిల్ రోడ్డు, శ్రీరామనగర్, మొహిద్దీన్ ఎస్టేట్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, పోస్టాఫీసు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.