అధికారులు పట్టుకున్న బియ్యం రేషన్ బియ్యమా కాదా అని నిర్ధారించడానికి కూటమి ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేసింది. పట్టుబడిన వెంటనే ర్యాపిడ్ పరీక్ష ద్వారా తేల్చి చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికోసం ప్రత్యేక కిట్లు జిల్లాలకు చేరాయి. కృష్ణా జిల్లాకు 43, ఎన్టీఆర్ జిల్లాకు 18 చొప్పున మొత్తం 61 కిట్లు సరఫరా చేశారు. వీటిలో 90 శాతం కిట్లు ఇప్పటికే అధికారులకు అందజేశారు. త్వరలో వీటితో పరీక్షలు మొదలవుతాయి.