మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం ఉపాధియే కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ కలెక్టరేట్‌లోని ఇగ్నైట్ సెల్‌ను బుధవారం ఆయన సందర్శించామన్నారు. 'రైజ్' (RISE) కార్యక్రమం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, జీవనోపాధి అవకాశాలను విస్తరించుకునేలా చేస్తుందన్నారు. మహిళలు తమ నైపుణ్యాలను నిలకడైన ఆదాయ వనరులుగా మార్చుకుని, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని ఆయన కోరారు.