ఆదివారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, అధికార పార్టీ శ్రేణులు వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేయడంపై తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు, లోకేశ్ అండదండలతోనే ఈ దాడులు జరుగుతున్నాయని, కూటమి పాలనలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఇలాంటి ఆటవిక చర్యలతో వైసీపీ నేతలను బెదిరించలేరని ఆయన అన్నారు.