మాజీ మంత్రి జోగి రమేష్‌ను విజయవాడ నుండి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు నెల్లూరు సెంట్రల్ జైల్ వద్దకు చేరుకుని, జోగి రమేష్‌కు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జోగి రమేష్ అరెస్ట్ అక్రమమని వైసిపి నేతలు నినాదాలు చేశారు.