కృష్ణా నదిలో ఎగువ నుంచి కొట్టుకు వస్తున్న బోటును ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో స్థానిక జాలర్లు గుర్తించారు. విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ల సహాయంతో బోటును గుర్తించి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ప్రకాశం బ్యారేజ్‌కి పెను ప్రమాదం తప్పింది.