రాష్ట్రంలో వైసీపీకి చెందిన బీసీ, కాపు నాయకులపై టీడీపీ నాయకులు పథకం ప్రకారం దాడులు చేయిస్తున్నారని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేశ్ ఈ దాడులకు సూత్రధారి అని ఆయన మండిపడ్డారు. హోం మంత్రి శాంతిభద్రతల విషయంలో విఫలమయ్యారని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.