వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల పట్ల అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. విజయవాడ బస్ స్టేషన్ సమీపంలోని ఫైర్ స్టేషన్ను ఆయన తనిఖీ చేసి, అగ్నిమాపక వాహనాలు, రెస్క్యూ పరికరాలను, అత్యవసర సేవలకు వినియోగించే ఉపకరణాలను పరిశీలించారు.