తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమినేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని NTR జిల్లా YCP అధ్యక్షులు దేవినేని అవినాష్ లబ్బీపేట వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోట్లాది మంది ఆరాధ్యంగా బావించే వెంకటేశ్వరస్వామి ప్రసాదం గురించి కూటమి నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చేయటం దారుణం అన్నారు. NDDB/NDRI ఇచ్చిన రిపోర్ట్ దృష్టిలో ఉంచుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.