ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా,
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని, మిగిలిన భాగాన్ని త్వరలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.