ఇంద్ర కీలాద్రిపై వైభవోపేతంగా గిరి ప్రదక్షిణ

4చూసినవారు
ఇంద్ర కీలాద్రిపై వైభవోపేతంగా గిరి ప్రదక్షిణ
అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. దేవస్థానం ఈవో వీకే శీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజల అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణలు, భజనలు, కోలాట నృత్యాల మధ్య సాగిన ఈ ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు దేవస్థానం తరపున కుంకుమ, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్