నేడు సాగునీటి సంఘాలతో భారీ సమావేశం

2చూసినవారు
నేడు సాగునీటి సంఘాలతో భారీ సమావేశం
జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ పరిధిలోని అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షుల భారీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. నీటి భద్రత, ప్రాజెక్టుల పునరుద్ధరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం రూ. 18 వేల కోట్ల బకాయిలు ఉంచి వెళ్లిపోయిందని, కూటమి ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్