అమ్మవారికి థాంక్స్ చెప్పాలని ఉంది: గాయని సునీత

1577చూసినవారు
అమ్మవారికి థాంక్స్ చెప్పాలని ఉంది: గాయని సునీత
ప్రముఖ గాయని సునీత శనివారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరినీ చల్లగా చూస్తూ దర్శనమిస్తున్న అమ్మవారికి థాంక్స్ చెప్పాలని ఉందన్నారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా 11రోజులు ఉత్సవాలు ఘనంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, అందుకు అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. విజయవాడలో ఎక్కడ చూసినా ఉత్సవ శోభ కనిపిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్