విజయవాడకు చెందిన తరుణ్ చెరుకూరి ప్రతిష్ఠాత్మక 'స్కోల్ అవార్డు'కు ఎంపికయ్యారు. ఆయన స్థాపించిన 'ఇండస్ యాక్షన్' సంస్థ ద్వారా ప్రభుత్వ సేవలను అట్టడుగు వర్గాలకు పారదర్శకంగా అందిస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారం కింద సుమారు రూ. 18.5 కోట్ల నగదు అందుకోనున్నారు. 2030 నాటికి 3 కోట్ల మందికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఆయన కృషి చేస్తున్నారు.