మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధ్వంసం జరిగితే ఆనందించాలనే పంథాను అనుసరిస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మోంథా తుపానును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోవడం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, ఆపద సమయంలో ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన జగన్ చేసే వ్యాఖ్యలు అర్థరహితమని, అవి రాజకీయ లబ్ధి కోసమేనని మండిపడ్డారు. బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చుని చేసే జగన్ వ్యాఖ్యలను ఎవరూ నమ్మరని ఆయన తెలిపారు.