విజయవాడలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. సత్యనారాయణపురంలో మంగళవారం రాత్రి గంజాయి స్మోకర్లకు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. సత్య నారాయణపురం వ్యాప్తంగా ఉన్న స్మోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని పరీక్షలు చేయించి, అనంతరం డీ అడిక్షన్ సెంటర్కు పంపిస్తామని సీఐ లక్ష్మీ నారాయణ తెలిపారు.