విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్

12చూసినవారు
విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్
ప్రతి శుక్రవారం సిట్‌ కార్యాలయంలో సంతకం చేయాలన్న షరతుపై మినహాయింపు కోరుతూ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మద్యం కుంభకోణంలో బెయిల్‌ మంజూరు సమయంలో విధించిన ఈ షరతు ప్రకారం, వచ్చే శుక్రవారం సంతకానికి వెళ్లలేనని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్