విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని) కుటుంబ సమేతంగా, సిబ్బందితో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం స్వామివారిని ప్రార్థించారు. రేపు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి మంచి ప్రాధాన్యత లభించాలని కోరుకున్నట్లు ఎంపీ చిన్ని తెలిపారు.