తిరువూరు టీడీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటిన వారిని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ విభేదాలకు కారణమైన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులతో తాను స్వయంగా మాట్లాడతానని సీఎం స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలిపారు.