NTR: కళ్లెదుటే కొడుకు మృతి.. తల్లి రోదన

12చూసినవారు
NTR: కళ్లెదుటే కొడుకు మృతి.. తల్లి రోదన
విజయవాడకు చెందిన 43 ఏళ్ల దివ్యాంగుడు సునీల్‌కుమార్, తన తల్లితో కలిసి మూడు చక్రాల బండిపై సత్తెనపల్లి వెళ్తుండగా మేడికొండూరు(M) పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టడంతో సునీల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని తల్లి గాయపడ్డారు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్