సమ్మె విరమణ.. ఎన్టీఆర్‌ వైద్య సేవలు పునరుద్ధరణ

5చూసినవారు
సమ్మె విరమణ.. ఎన్టీఆర్‌ వైద్య సేవలు పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రుల అసోసియేషన్ సమ్మె విరమించింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్, వైద్య సేవా పథకం కింద సేవలను పున:ప్రారంభించాలని నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమర్ యాదవ్‌తో జరిగిన చర్చల్లో, ప్రభుత్వం వెంటనే రూ.250 కోట్ల బకాయిల చెల్లింపునకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 15లోపు ఈ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్‌మెంట్ విధానానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్