జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం నేతృత్వంలో విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 12 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురికి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన తొమ్మిది మందికి రూ. 90 వేల జరిమానా విధించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.