వీరులపాడు: లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తికి గాయాలు

81చూసినవారు
వీరులపాడు మండలం జగన్నాధపురం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, తిరువూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారు, కంచికచర్ల నుంచి ఎర్రుపాలెం వెళ్తున్న లారీని ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. కాగా పోలీసులకు సమాచారం అందించి, గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించామని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్