వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విజయవాడ జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. నకిలీ మద్యం కేసులో 226 రోజుల జైలుశిక్ష అనుభవించిన ఆయనను వైసీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, జోగి రమేష్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు పుట్టిన గ్రామంలో పుట్టడం తన తప్పా అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.