విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. తాము జీతాలు పెంచాలని కోరడం తప్ప వేరే డిమాండ్లు లేవని, తమ డిమాండ్లను పరిష్కరించకుండా అరెస్ట్ చేయడం దారుణమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను పోలీసులు భగ్నం చేయడం మంచి పద్ధతి కాదని నినాదాలు చేశారు. పోలీసుల దౌర్జన్యం నశించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు.