విజయవాడ: కొండవీడు వాగు 'రివర్’ ఫ్లో

10చూసినవారు
విజయవాడ: కొండవీడు వాగు 'రివర్’ ఫ్లో
అమరావతి ప్రాంతంలోని వరద నీటిని కృష్ణానదిలోకి తరలించే కొండవీడు వాగు రెగ్యులేటర్ ప్రమాదస్థాయికి చేరుకుంది. భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో నీటిమట్టం 15 అడుగులకు చేరడంతో, దెబ్బతిన్న రెగ్యులేటర్ గేట్ల ద్వారా వరద నీరు తిరిగి వాగులోకి చేరుతోంది. 30 ఏళ్ల కిందట నిర్మించిన ఈ రెగ్యులేటర్ గేట్లు అన్నీ దెబ్బతినడంతో, అమరావతి ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. కొండవీడు వాగులోకి కొట్టెళ్ల వాగు, పాలవాగు, ఎర్రవాగులు కూడా కలుస్తాయి, ఇవి ఆయా ప్రాంతాలకు రక్షణగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్