డింపుల్ జైన్ అనే వ్యక్తి ఐడీబీఐ బ్యాంకు ఖాతా నుండి రూ. 97 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా బదిలీ చేసుకున్నారు. ఈ నెల 6 నుంచి 11 తేదీల మధ్య మూడు అనుమానాస్పద లావాదేవీల ద్వారా ఈ మొత్తం కాజేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై బాధితురాలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.