విజయవాడ: కనకదుర్గమ్మ ఆలయంలో భద్రతా వైఫల్యం

9చూసినవారు
విజయవాడ: కనకదుర్గమ్మ ఆలయంలో భద్రతా వైఫల్యం
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. మహామండపం ఆరో అంతస్తులోని మహిళల బాత్రూంలోకి చొరబడి, వీడియో తీస్తున్న నరేష్ అనే వ్యక్తిని మహిళలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలలో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్