విజయవాడ: నేడు ముగియనున్న శాకంబరీ ఉత్సవాలు

85చూసినవారు
విజయవాడ: నేడు ముగియనున్న శాకంబరీ ఉత్సవాలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గత రెండు రోజులుగా శోభాయముగా కొనసాగిన శాకంబరీ ఉత్సవాలు గురువారం  ముగియనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు దుర్గమ్మ భక్తులకు వైభవంగా దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్