విజయవాడ: పశ్చిమ బైపాస్కు... మార్గం సుగమం!

0చూసినవారు
విజయవాడ: పశ్చిమ బైపాస్కు... మార్గం సుగమం!
పశ్చిమ బైపాస్ (ప్యాకేజీ-3)లో విద్యుత్ హైటెన్షన్ వైర్ల అలైన్మెంట్ వివాదంపై గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. జక్కంపూడి, అంబాపురంలోని ఆరు టవర్లను పాత అలైన్మెంట్ ప్రకారం ఎత్తు పెంచాలని ఆదేశించింది. నున్నలోని మరో రెండు టవర్ల విషయంలోనూ స్పష్టత రానుంది. కూటమి ప్రభుత్వం ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, కలెక్టర్ లక్ష్మీశతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రైతులు, ఎన్హెచ్ఎఐ అధికారులతో చర్చించి పరిష్కారం చూపడంతో సమస్య కొలిక్కి వచ్చింది. ఎన్హెచ్ఐఏ సానుకూలంగా స్పందించింది.

సంబంధిత పోస్ట్