విజయవాడ: ఐదు నిమిషాల్లో వచ్చి ప్రాణాలు కాపాడారు..!

2984చూసినవారు
విజయవాడ: ఐదు నిమిషాల్లో వచ్చి ప్రాణాలు కాపాడారు..!
విజయవాడలోని పైపుల రోడ్డు హెచ్పి బంకు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బి. రాజు (32) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. బైక్పై వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమైంది. స్థానికులు వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించగా, 5 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది మోహన్రావు, వినయ్ కుమార్ క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో రాజు ప్రాణాలు నిలిచాయి.

సంబంధిత పోస్ట్