విజయవాడ కృష్ణలంకలో బుధవారం అప్పుడే పుట్టిన నవజాత శిశువును బాత్రూంలో వదిలేసిన ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆ పసికందును గుర్తించారు. తల్లిదండ్రులను గుర్తించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, అనంతరం చిన్నారిని వారికి అప్పగించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబు చిన్నారికి ‘త్రినేత్రి’గా నామకరణం చేశారు. పోలీసుల తక్షణ స్పందనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.