Mar 13, 2026, 10:03 IST/
మాజీ డీజీపీ HJ దొరకు తీవ్ర అస్వస్థత
Mar 13, 2026, 10:03 IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన, శుక్రవారం ఉదయం నిమ్స్‌లో డయాలసిస్ అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లోని బాత్రూమ్లో జారి పడిపోవడంతో, ప్రస్తుతం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.