Apr 13, 2026, 17:04 IST/వేములవాడ
వేములవాడ
ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
Apr 13, 2026, 17:04 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గత మూడు నెలల్లో 60,579 మంది ఔట్ పేషెంట్లు, 3,939 మంది ఇన్ పేషెంట్లు నమోదయ్యారని వైద్యులు తెలిపారు. జనవరి నుంచి మేజర్ ఆపరేషన్లు 365, మైనర్ ఆపరేషన్లు 993 జరిగాయి. స్త్రీ ప్రసూతి విభాగంలో 416 సిజేరియన్లు, 111 సాధారణ ప్రసవాలు జరిగాయని వెల్లడించారు.