Apr 13, 2026, 08:04 IST/
దోస్త్ 2026-27 నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ ప్రకటన
Apr 13, 2026, 08:04 IST
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ – DOST 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి సోమవారం ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. మొదటి విడత రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు, రెండో విడత మే 15 నుండి 25 వరకు, మూడో విడత మే 31 నుండి జూన్ 15 వరకు కొనసాగుతుంది.