కృష్ణా జిల్లా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ శాఖ కార్యవర్గ ఎన్నిక నేడు రసవత్తరంగా జరగనుంది. అధ్యక్ష పదవితోపాటు ఇతర కార్యవర్గ ఏర్పాటుకు ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పదవికి ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు పోటీ పడుతున్నారు. రాజీ ప్రయత్నాలు విఫలమవడంతో ఎన్నిక అనివార్యమైంది. మచిలీపట్నంలోని రెవెన్యూ హాలులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరించి, 3.30 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు.