విజయవాడ మున్సిపల్ స్టేడియంలో గురువారం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన జ్యోతిర్ భానుకు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యిన విషయం తెలిసిందే. అయితే భాను కుటుంబ సభ్యులు ఆయన అవయవాలు దానం చేయడంపై అంగీకారం తెలిపారు. వారి అవయవాలు 8 మందికి జీవం పోశాయి. “మరణించిన మా నాన్న బ్రతికే ఉన్నారు” అనే నమ్మకంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అయన అమర జీవుడు అయ్యారని అతని పిల్లలు తెలిపారు.