కృష్ణా జలాల వివాదం.. తెలంగాణ వాదనలు చెల్లవన్న ఏపీ

4316చూసినవారు
కృష్ణా జలాల వివాదం.. తెలంగాణ వాదనలు చెల్లవన్న ఏపీ
AP: బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఎదుట మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ తరఫున సీనియర్‌ కౌన్సిల్‌ జయదీప్‌ గుప్తా వాదనలు వినిపించారు. ప్రాజెక్టుల నీటి కేటాయింపులను తిరగదోడేందుకు వీల్లేదని, కృష్ణా జలాల పంపకం తొలి, రెండో ట్రైబ్యునళ్ల ద్వారా పూర్తయిందని, ఇది పూర్తి తీర్పుగా వెలువడిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ చేసిన వాదనలు చెల్లుబాటు కావని, ఏ విషయాన్నీ వారు నిరూపించలేకపోయారని తెలిపారు. కాగా, మూడు రోజుల పాటు ట్రైబ్యునల్‌ ముందు ఏపీ వాదనలు కొనసాగనున్నాయి.